Saturday, June 1, 2019

ఘన 'సినారె ' కు మన నివాళి

ఘన  'సినారె ' కు  మన నివాళి


భానుడి తేజస్సు కలిగి - బ్రహ్మాండమును చిలికి 
దక్కనులో ఉర్దూ దుక్కి దున్ని – దిక్కులన్నీ పిక్కటిల్లే
మొక్కవోని మొక్కలెన్నో ఒకటొకటిగ నాటి
ఇడుగు ఇరువాలు తెలుగులోన గావించి
పద్య,గద్య,పాట, గజల్ ,పద కవితలలో రారాజై

తెలుగు సాహిత్యపు చెలుకలోన- చెరగని సౌరభాలను పూయించిన రైతు బిడ్డ
ఆధునిక కవి సార్వభౌముడిగా అవతరించిన 
హంసవాహిని వరపుత్రునికి - సింగిరెడ్డి వారి చిరస్మరణీయుడికి
నంది పురస్కారం తో నగర మోగించి -పద్మ భూషణ్ ల నందుకుని
విశ్వంభరుడిగా అవతరించి జ్ఞాన పీఠమెక్కిన ఘన సినారె గారికి

వర్ణమాల నేర్చుకుంటున్న వరుస క్రమములోని
చిట్ట చివరి బల్ల మీది చిరు విద్యార్థిని నేను 
తెలుగు తనమునకు ప్రతీకగా -జాతి వెలుగులు వెదజల్లిన
ఘన  'సినారె ' కు  మన నివాళి



నగునూరి రాజన్న, SK 624
NTPC RAMAGUNDAM

No comments:

Post a Comment