అంశం - మంచు పల్లకి
తేదీ 20-05-2019
శీర్షిక - అవుతుందా ?
సంఖ్య - 190
పచ్చ పచ్చని ప్రకృతి వనాలు
పక్షుల కిలకిలా రవాలు
పసందైన మానవ జీవనాన
పలు ఆశల కోరికలకు పునాదులు
ఆశే మనిషికి జీవన గమనంలో దివిటీ
అసలు బతుకు పోరాటానికి నాంది....
అవి తీరటం కాల మాన పరిస్థితులు
ఆత్యాశ నిరాశల సంతులనం
అది గమనిస్తే ఆనందం ......
ఆరాటాల పరుగుల పందెంలో
అధమం అయిపోతున్న ప్రకృతి ..
అందుకే పతనమౌతున్న పర్యావరణం
రక రకాల కాలుష్యాల రక్కసులు ....
మానవ తప్పిదాల ఫలితం
కలి కబంద హస్తాలలో బందీ
కడకు ప్రశ్నార్థకమేనా జీవకోటి...
కావాల్సిందేనా మంచు పల్లకి ఈ విశ్వం?
No comments:
Post a Comment