Saturday, June 1, 2019

పునరుత్తేజం

అంశం -పునరుత్తేజం
తేదీ- 15-05-2019
శీర్షిక - ఆణిముత్యపు మైలురాయి .. 
సంఖ్య -186

అమ్మ ప్రేమ ముందు అన్నీ బలాదూరే
అరవై తొమ్మిది నుండి డెబ్భై నాలుగు  
ఆంధ్ర తెలంగాణాల వేరు కుంపట్ల అల్లర్లు.... 
అదను దొరికితే చాలు బైకార్డులు, ధర్నాలు  
అతలాకుతలమైన చదువు సంధ్యలు 
అప్పుడే  పన్నెండుకై పట్నం కాలేజీలు 

అమ్మా నాన్నల ఆత్మీయతల కొలుపులు
అమ్మ శత హితోపదేశం ....   
అసలు చదువు వదలద్దు ఏమైనా... చెయ్యి
అరకొర చదువులు ... అత్తెసరు మార్కులు  
అట్లనో ఇట్లనో పన్నెండు అయిందనిపించాం ... 
అసలు కథ మొదలైంది ....... 

అటెన్క డిగ్రీలో చేరనైతే చేరినం..... 
అక్కడ ఇంకా ధూందామె...  
అయినదానికీ  కానిదానికీ అల్లర్లే 
అసలు  విద్యార్ధులంటేనే  పంతుళ్ళకు భయం... 
ఆ రోజులు ఆలా ఉండేది 
ఆళ్ళెక్కడ పోతే మాకేంది... మా జీతాలు మాకు ... 
అంతోటి దానికి ఆజ్యం తెలంగాణా లొల్లి .... 

అంటుకునేది దావానంలా ఏమన్నంటే.... 
అడుగెయ్య భయం భయం.... తరగతి వైపు 
అడుగుదామంటే భయం భయం.... చదువుకుందామని.. 
ఆ రోజుల్లో డిగ్రీ అంటే పరీక్షలన్నీ మూడేళ్లకే ... 
హమ్మయ్య మొదటి సంవత్సరమైతే గడిచింది 

అప్పుడు తెలిసింది అందరికి .... 
అగ్గి బరాట లాంటి కులపతి నియామకమయ్యారని 
ఆరేనండి .....  మన పింగళి జగన్మోహన్ రెడ్డి గారు 
ఆయన కబురు పెట్టాడు..... మూడేండ్ల డిగ్రీ కాదు 
అప్పటి నుండి ప్రతి సంవత్సరం పరీక్షలే... అని 
అందరి నోళ్ళల్లో వెలక్కాయ పడ్డది ...  కానీ ....  
అదే ఎంతోమంది నా లాంటి వాళ్లకు పునరుత్తేజమై 
అలవోకగా పట్టభద్రులయ్యేందుకు రాచమార్గమయ్యింది... 
అరవిరిసిన జీవితాలకు నాంది అయ్యింది..... 
అది ఎన్నటికీ మరచి పోలేని ఆణిముత్యపు మైలురాయి .. 
అమ్మ ప్రేమతో విజయం సాధ్యమైందని నమ్ముతాను ... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )


No comments:

Post a Comment