అంశం : చుట్టకుదురు
తేదీ : 22 -06 -2019
శీర్షిక : మట్టి మనుషుల చిట్టి అవసరాలు
సంఖ్య: 218
మట్టి మనుషులు మట్టి అరుగులు
మట్టి పాత్రలు మలినమెరుగని మనుసులు
ప్రశాంత ఆరోగ్యాలు పరుగులేని జీవితాలు
సరళమైన పలుకులు స్వచ్ఛమైన ఆత్మీయతలు
తరం మారగానే అంతరం ఏర్పడ్డట్టు
ఎవరికి ఎరుక ఆనాటి ఇషిరెలు ఈనాడు
ఎండు గడ్డి, ఈతాకులు, తాటి ఆకులు,కండువాలు
ఇకమతుగ వడివెట్టి అందంగా చుట్టేటోళ్లు...
కుండలను కుదురుగా నేలపై కూర్చుండబెట్ట
ఇత్తడి బిందెలకైతే ఇగురంగా అరగనియ్యకుండ
ఆడబిడ్డ సమమైన కూరాడు నీరాడు పొందించ....
పొలమెల్లే అవ్వ నెత్తిమీద గంపకో నీళ్ళ కడవకో
అవసరాన సమకూర్చుకున్న అతి చిన్న వస్తువే
ప్రతి ఇంట పదిల పర్చుకున్న ప్రాధామ్యం సుమా!
గ్యాస్ మొద్దులకింద గమ్మత్తు గీరెలతో...
స్టీల్ వెండిలోన సుతారంగా అందుబాటయ్యే
సువిధైన పనితీరుకు సుక్కానిగ నేస్తమా....
ఎక్కడైనా దొరుకుతాయి ఎంచక్కగ ఈనాడు...
ఏదైతే ఏమిలే కాదేది కవితకనర్హ చందంగా
అందంగా అమిరింది సాహితీ కర్షకుల గుండెల్లో
గల గల గోదారి జలాల తీపి జ్ఞాపకాల వోలె
కవితలల్ల నేటి కవిత సమూహమెల్ల.......ఈనాడు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment