అంశం - జారుడు మెట్లు
తేదీ - 01-06-2019
శీర్షిక - పారా హుషార్ ...
సంఖ్య - 200
అనాయాసంగా అందితే ఏదైనా లోకువే
వక్ర మార్గమైతే ఇక అంతే ఉండదు...
కళ్ళు మూసుకుని పాలు తాగితే
లోకమంతా మనల్ని చూస్తుంది...
మనం చేసే పనికి ఆశించే ప్రతిఫలానికి
తార్కిక సామీప్యత ఉండాలి
ధర్మబద్ధమై ఉండాలి, నలుగురు మెచ్చాలి
సమకాలీన న్యాయ సమ్మతం కావాలి
ఎంత ఎదిగితే అంత ఒదగాలి...
కర్మలో ఎంతగొప్పవాడైతే ఏమి
కర్ణుడు సుయోధననుని పంచన చేరినట్టు....
తప్పుడు మార్గం ఎంచుకుంటే
తప్పదు పతనం ఏనాటికైనా...
నక్క వినయాలు ప్రదర్శించి
గుక్క తిప్పుకోకుండా మాట్లాడి
ఎప్పటికప్పడు కొత్త కొత్త దార్లలో
ఎదుటి వారిని బురిడీ కొట్టించి
ఎంతైకైనా తెగించే వాళ్ళకు
ఎప్పటికి కొదువలేదు ఈ కలి మాయలో ....
పచ్చి రాజకీయవాదులు,
ప్రజా పనుల్లో లంచావతారాలు....
దేర్ హై మగర్ అంధేర్ నహీ హై
అప్పటి వరకు మనమే పారా హుషారై
అప్రమత్తంగా ఉండాలి......
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment