అంశం : వడ్డన
తేదీ : 10 -05 -2019
శీర్షిక : నేటి వింత
సంఖ్య : 182
ఆచార గౌరవాన అరయ సాంప్రదాయమై నిలిచె
ఆది నాల్గవదిగా మన ప్రాధాన్యతన
అతిథి దేవోభవ అన్న సూక్తి ....
పచ్చని ఆకు లోన వెచ్చని అన్నంబు బెట్టి
పచ్చళ్ళు పొడులు పలు కూరగాయలు
పరమ శ్రేష్ఠమయిన నెయ్యితోడ
పచ్చి పులుసు,సాంబారు పెరుగు వేయ
పాయసాన్నం, పాపడాలు అదనంగా వేసి
ప్రేమతోన వడ్డించిన పెరగదా అనుబంధం ....
పదహారు రోజుల పెళ్ళి ఉత్సవాలను
పది పూటలకు పరముగా కుదించి ఆనక
అదియును కుదరక ఆ రోజుకా పూటకే అన్నట్టు
అయినదనిపిస్తున్నారు అందరీనాడు....
వచ్చె పొయ్యెడి బంధు మిత్రులకు వరుస బెట్టి
వంట,వార్పులు, వసతులు రోజులెల్ల చేయలేక
వాటముగా ముహుర్తములను సరిచేసుకుంటూ
అభిజిత్ లని అలవోకగా ఆచరిస్తున్నారు...
అదియును బంతి భోజనాలు మాయంబు జెసి
అందరిని వరుసలో నిలిపి బఫెలంటూ బహు చిత్రంగా....
పట్టణ సంస్కృతి ఫరిడవిల్లంగ
పలుకరింపులకే పరితమయ్యె బంధు బలగాలు
అతిథులన్న ఆమడలు నిలువంగ
అసలు వడ్డనలన్నవింతే... నేటి యువతకు...
No comments:
Post a Comment