Saturday, June 1, 2019

మేఘ సందేశం

అంశం-మేఘ సందేశం
తేది - 17-05-2019
శీర్షిక - ఇంకానా..... 
సంఖ్య -188 

ప్రశాంత ప్రాకృతిక విశ్వాన  
పదిలంగా అడుగులు వేసిన        
ప్రాచీన మానవ జీవనానికి ... 
ప్రకృతి, పంచభూతములు
పచ్చ పచ్చని పర్యావరణం,
పవిత్రత, క్రమశిక్షణ 
పని పద్ధతి, కట్టుబాట్లు,   
పలుకుల  విలువలు, 
ప్రేమలు,మానవీయత, 
మేఘసందేశాల మధురిమలు.... 

నవ నాగరికత అంటే  
నడకలు కాదు పరుగులే 
పద పద జీవితమంటూ......   
హై టెన్షన్ లైన్ల అల్లికలు 
పలు సెల్ టవర్ల  పదనిసలు 
అలుసైన అయస్కాంత క్షేత్రాలు ... 
పట్టించుకోని పర్యావరణ పతనం.... 
కకావికలం కావిస్తున్న 
కాలుష్యాల కాసారాలు .... 
పలు రకాల జీవరాసుల అదృశ్యం.... 
పదను లేక చిక్కి శల్యమౌతున్న 
భూమండలం.. చంద్రమండలం ... 
చల్ల గాలులు, పిల్ల తెమ్మెరలు, మాయం.... 
అప్పడప్పుడు క్యుములోనింబసులు తప్ప.... 

యాంత్రికత దాటుకుని 
సాంకేతికత సొబగులద్దుకుని   
నెట్టింట్లో చేరిన జీవితాలు...  
పిడికిట్లో బందీ అయిన విశ్వం .... 
కంప్యూటింగ్ లోనే " క్లౌడ్" ను 
వెతుక్కుంటున్న.... వాడేసుకుంటున్న....  
నిత్య శోధక  అత్యాధునికునికి 
ఇంకానా ...  మేఘ సందేశాలు  ? 

No comments:

Post a Comment