Saturday, June 1, 2019

ఇల్లాలి ముచ్చట్లు

అంశం - ఇల్లాలి ముచ్చట్లు
తేదీ - 21-05-2019
శీర్షిక - విశ్వ సుభిక్షానికి చుక్కాని... 
సంఖ్య - 191

అమ్మానాన్నలను వదులుకుని  
ఆమె ఇంటిపేరును  మార్చుకుని 
అనితర త్యాగాలకు మారుపేరుగా 
అడుగిడుతుంది మెట్టినింటిలో.... 

ఊరు వాడ కంటే ముందే 
ఉదయాతపూర్వ మేలుకొలుపుతో 
ఇల్లు వాకిళ్ళను ఇంపుగ  మెరిపించే 
చుక్కల్లో నిలిచిన  చందమామ  ... 

ఇంటిల్లి పాదికి ఇచ్చానుకూలంగా 
సమయానుసారంగా అమర్చే గోడగడియారమే.. 
ఉదయం  నుండి సాయం వరకు 
ఉరుకులు పరుగుల్లో పి టి ఉషే....  

కన్న తల్లి తండ్రులను 
కనిపెంచిన పిల్లలను
కంటి పాపల్లా సదా రక్షించి  
కనిపెట్టుకునే అమృత సిపాయి.... 

ఇరుగు పొరుగుతో ఇగురంగా మెదిలే 
విద్వత్తెరిగిన  విదురనీతుల విశారద  .... 
అలుపెరుగని అనంత శ్రామికత్వం 
ఆమెకు మాత్రమే స్వంతం .....స్వాంతన. 

బతుకు నావ అతలాకుతలం కాకుండా  
బరువు బాధ్యతలలో బంధమై 
ఆపద సంపద సమయాలలో   
అనువైన మార్గాలు చూపే స్ఫురద్రూపి... 

ఇల్లు స్వర్గమైతే లోకమే ఇంద్ర పర్వం   
ఒక్క మాటలో నిక్కచ్చిగా 
ఒట్టేసి నిజం చెప్పాలంటే 
విశ్వ సుభిక్షానికి చుక్కాని... 

No comments:

Post a Comment