Saturday, June 1, 2019

ముందడుగు

అంశం - ముందడుగు 
తేదీ - 25-05-2019
శీర్షిక - అత్యుత్తమం 
సంఖ్య - 195

మనువు అయినా మనం అయినా 
మంచి అయినా చెడు అయినా 
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు 
ముందడుగేస్తేనే మార్గం ... మైలురాయి 

ఆసేతు హిమాచలం  
అచంచల అహింసా మార్గం  
మాహాత్ముని మాటే మంత్రం  
సాధించాం  స్వాతంత్రం .... 

తెల్లోడు వదిలిన మన దేశం  
అతలాకుతలపు ఆర్ధికాంశం     
పంచవర్ష ప్రణాళికల తంత్రం 
పారిశ్రామిక ప్రగతికి మార్గం ..... 

పి వి లిబరలైజేషన్  పుణ్యం  
ఆర్ధిక ప్రగతిలో ప్రైవేట్ స్వామ్యం  
అదే మలి దశ పారిశ్రామికీకరణం  
ఆర్ధిక పరిపుష్టికి గమన గమ్యం .... 

సమపాళ్ళ సంస్కృతితో  దేశం 
సర్దుకున్నఆర్ధిక ప్రగతి పథం
అంతరిక్ష చరితలో  సైతం  
అత్యుత్తమ స్థానం పదిలం ....    

No comments:

Post a Comment