Saturday, June 1, 2019

భీష్మ ప్రతిజ్ఞ

అంశం- భీష్మ ప్రతిజ్ఞ 
తేది - 18-05-2019
శీర్షిక - మాట మీద నిలబడు 
సంఖ్య -189 

తండ్రుల కోరికలకై తనయులానాడు
తలకెత్తుకున్నారు తమవంతు బాధ్యత 
తదనంతరమా కృతము చారిత్రకమై 
ఆచంద్ర తారార్కం విలసిల్లుచుండె ... 
 
త్రేతా యుగమ్మున దశరథ నందనుడు 
కారణజన్ముడు శ్రీరామచంద్రుడు....   
ద్వాపరమున శంతన పుత్రుడు 
అష్టమ వసువైన దేవవ్రతుడు... 

ఆడిన మాట తప్పని హారిశ్చంద్రుడు కూడా 
అవని యందు గొప్ప వాక్పరిపాలకుడే ... 
కాల మాన పరిస్థితులు కలిసొచ్చాయో ఏమో .... 
కానీ.... వారికే చెల్లింది వాక్పరిపాలన.... 

ప్రజలందరిని  పక్కన బెడితే 
పాలకులకైనా పైస మందముంటే 
ప్రజలంతా సుఖ శాంతుల 
ఫరిడవిల్లి సుభిక్షమై వర్ధిల్లరా  .... ఈనాడు  
చరిత్రలో సువర్ణమై లిఖించరా .... 
ముందు తరం......  
 
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

No comments:

Post a Comment