అంశం - టీ కప్పులో తుఫాను
తేదీ -14-05-2019
శీర్షిక - ఆనందాల జాడలు
సంఖ్య - 185
పట్టుమని మూడేళ్లు కూడా నిండని
పసివాణ్ని ఇంగ్లిష్ చదువులంటూ
పయనింప జేసే పరిస్థితులు
ప్రతి తల్లి తండ్రుల గుండెల్లో
పరితపించే పరిస్థితులు.....
అల్లారుముద్దుగా పెంచుకున్న
ఆడపిల్లని ఓ అయ్య చేతికి
అప్పగించడానికి ప్రతి తల్లి తండ్రులు పడే
ఆరాటాల ఆవేదనల ఆపసోపాలు .....
పది వరకు పదిలంగా
కళ్ళ ముందు పెంచుకుని
లోకం పోకడ పూర్తిగా తెలియని
పసి కూనల్ని జనారణ్యంలో
వేలు లక్షలు కుమ్మరిస్తూ
ఉజ్వల భవిష్యత్తుకని ఊరడించుకుంటూ
ప్రతి తల్లి తండ్రులు పడే తపన.....
అన్యోన్యాల అవిభాజ్య కుటుంబాలలో
అడుగడుగున తారసపడే అపార్థాల అలకలు...
ఆనందాల విలువల జాడలు తెలియాలంటే
అరవిరిసిన చిరుకోపాల బుంగమూతులు
అప్పుడప్పుడు చిన్నా చితకా అల్లకల్లోలాలు
పెద్ద వాళ్ళ సర్దుబాట్లతో పటాపంచలయ్యే
టీ కప్పులో మెరిసే తుఫాను చంద్రికలే ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment