అంశం :డౌరీ కళ్యాణం
తేదీ 03-06-2019
శీర్షిక - ఆర్థికాంశాలకు అమ్ముడు పోతే....
సంఖ్య -201
ఆశ మనకు ఆశయాలు జనులకు
ఆశను జయించడం అశనిపాతం
ఆశలు అత్యాశలవుతే అన్నీ అనర్థాలే
అదిగిమిస్తే ఎంత బాగుంటుంది ...
నువ్వా నేనా అనుకుంటే ఎలా ...
నువ్వు నేనైనా నేను నువ్వైనా ఒక్కటే
భూమి గుండ్రమన్నంత సత్యంలా
ఇద్దరు సమమైతేనే సృష్టికి మూలం ...
ఎంతో నాగరీకులమంటూనే
ఇంత మంచి తర్కం విడిచి
అంతా తామే అనే అహంతో
నేల వదిలి సాము చేస్తామంటారు ...
మానవత్వ విలువలు మసక బార్చి
మనీ మాత్రమే జీవితమనుకుంటూ
అతివలంటే అతి పలుచన భావిస్తూనే
అమ్ముకుంటున్నారు తమకు తాము ....
ఆత్మీయతలు వికసించి ఆనందాలు పరిమళించి
అన్యోన్యత ఇచ్చిపుచ్చుకుంటే మానవ కళ్యాణం
అనర్థాల ఆర్థికాంశాలే ప్రాధాన్యమై
అమ్ముడు పోతే డౌరీ కళ్యాణమే కదా!
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment