అంశం - యవనిక
తేదీ - 14-06-2019
శీర్షిక - నాటకరంగం
సంఖ్య - 211
అనేకానేక అపసోపాలతో
అవతరించిన నాటకరంగం
సురభి కళల వారి పుణ్యామాని
సుందరముగ విలసిల్లె భాష..
తెలుగునేల నలు చెరగుల
సుగుణ భావనలు పంచ...
పౌరాణికాలతో పాగావేసినా
జానపదాలతో జనం గుండె చేరినా
చారిత్రికాలతో చిత్తములు దోచినా
సాంఘికాలతో సమకాలీన
సాదృశ్యాలను సన్నుతించినా
సాంప్రదాయాలతో నాగరిక
ఉన్నతాలను ఉటంకించినా...
ఉవ్వెత్తున వెలుగులు చిమ్మి
ఉర్రూతలూగించిన నాటకరంగపు
యవనిక ఉనికి పోరాటాల బాట పట్టి
సంతసమ్ముగ జరుపవల్సిన
శత వత్సరముల పండగను
కనా కష్టముగ కావించబడె .....
మార్పు మనుగడలో సహజమన్నంతగా
సాంకేతికత సొబగులద్దుకుని
సంధించుకుంటున్న వెండితెర పూదోటలతో
కళారంగం వేన వేల మార్పులతో
నాటకరంగమే కనుమరుగయ్యే కాలమొచ్చే ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment