అంశం: అవనిలో అమ్మ
తేది: 11-05-2019
శీర్షిక : అమ్మంటే ఆత్మ స్వరూపం
సంఖ్య : 183
భగవంతుడు సర్వాంతర్యామీ అయినా
ప్రతివారినీ ప్రతి క్షణం కాచుకోలేనేమో అని
అమ్మనిచ్చాడు అందరికి ....
రక్తమాంసాలు రంగరించి
క్షణం క్షణం తాను కరిగిపోతూ
ప్రతిక్షణం పరితపిస్తూ
మనకు రూపమిచ్చి
కణం కణం నింపుతుంది అమ్మ...
కండరాల పొత్తిళ్ళలో
కడుపులోన తొమ్మిది నెలలు
కళ్ళు కాయలు చేసుకుని
కష్టాలను తాను భరిస్తుంది ....
అవని కన్నా విశాలం
ఆకాశం కన్నా ఉన్నతం
సముద్రం కన్నా లోతైనది
వాయువు కన్నా చల్లదనం
అగ్నికన్నా పవిత్రం
విశ్వం కన్నా అనంతం
అమ్మ ప్రేమ ....
అమ్మ శ్వాస పిల్లలే
అమ్మ ఆలోచన పిల్లలే
అమ్మ అడుగు పిల్లలే
అమ్మ లేకుంటే అంత ఆగమ్యగోచరమే...
‘అమ్మ’ అంటే ఆత్మ స్వరూపం
అమ్మంటే అక్షరాలేనని అనుకోకు మిత్రమా
'అ' అంటే అనుక్షణం
'మ్మ' అంటే మరువకూడనిది
అమ్మంటే ఆణువణువూ నువ్వేనని
అమ్మంటే ఆత్మేనని నమ్ము సోదరా
అమ్మ ప్రేమను
అక్షరాలలో అమర్చడం
అదృష్టమే కానీ....
ఏ భాష చాలదు
ఏ భావం సరిపోదు.
అమ్మంటే ఆత్మ స్వరూపం
అమ్మంటే పరమాత్మ రూపం
అమ్మంటే అర్చరాది మార్గం
అమ్మంటే జగద్విదిత స్వర్గం
No comments:
Post a Comment