అంశం - పత్రహరితం
తేదీ- 20-06-2019
శీర్షిక - నందన వనం
సంఖ్య- 216
తొలకరి చినుకు చిలికితేనే
పచ్చని తివాచీ పరుచుకుంటుంది
తొలిపొద్దు కిరణాలు విచ్చుకుంటేనే
పత్ర హరితం ఫరిఢవిల్లుతుంది...
హరితముతోనే కదా మానవ చరితం
పచ్చదనం జీవిస్తేనే ఆరోగ్య పర్యావరణం
జీవకోటి ఉనికికైనా జీవ సజీవాలకైనా
చెట్టు నీరు రెండు... రెండు కళ్ళ లాంటివి.....
ధవళ వర్ణపు రవికిరణం హాలికుని స్వేదం
ప్రజల ఆకలి తీర్చే పచ్చని పంటౌతుంది
పాడి పంటల పల్లె తల్లులు చల్లగుంటేనే
పరిశ్రమల ప్రగతి చక్రం పరుగు పెడుతుంది
ప్రాణవాయువులిచ్చే జీవ సంక్షేమ హరితాన్ని
రక్త పింజరయి మనిషి స్వార్థం... నిర్లక్ష్యం... మింగేస్తుంటే
అగ్నిగోళమై అవని నిప్పురవ్వలు విరజిమ్మదా ....
అతి నీల లోహితం అతలాకుతలం చేయదా .....
పచ్చదనం పెంపొందితేనే పర్యావరణ సంక్షేమం
ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే అలవాటుగా మొక్క నాటాలి
కన్న పిల్లలపై ప్రేమలోలె మనం.. కదిలి పెంచాలి వనం...
ఎడారులను తలపించే భూమాత కాదా ఇక నందనవనం....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment