నవవిధ భక్తి సూత్రం
నవ విధం నిజ భక్తి సాగరం
అందునా ప్రధమం
దైవ లీలల శ్రవణం..
ఆనక ద్వితీయం
ఆనంద కీర్తనం...
తదుపరి తృతీయం
తదాత్మ్య స్మరణం .....
చరితార్థ చతుర్థకం
భగవత్ పాదసేవనం...
ప్రాణమే పంచమమ్
ప్రణవా అర్చనం ...
పుష్టి షష్టమ్
సాష్టాంగ ప్రణామం...
సర్వహిత సప్తమం
సర్వదా దాస్యం.....
అనంతం అష్టమమ్
సుఖమైన సఖ్యతమ్
అత్యుత్తమం నవమం
భక్తి రస సారం ఆత్మనివేదనం / ఆత్మార్పణం
"నవవిధ భక్తి సూత్రాల్లో మొదటిది శ్రవణం. అంటే వినడం, ఏం వినాలి? భగవంతుని లీలలు వినాలి.
రెండు కీర్తనం. అంటే భగవంతుణ్ణి కీర్తించాలి.
మూడు స్మరణం. అంటే భగవంతుణ్ణి ఎల్లవేళలా స్మరించాలి.
నాలుగు పాదసేవ. అంటే భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అతడే అనుకోవాలి. అనుకుని భగవంతుని పాదాల మీద తల వాల్చాలి.
అయిదు అర్చన. భగవంతుణ్ణి అర్చించాలి.
ఆరు నమస్కారం. అంటే అహంకారాన్ని అణచుకుని, నీ పాదాలే శరణంటూ భగవంతుని పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం.
ఏడు దాస్యం. అంటే మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా భగవంతునికి పరిచర్యలు చెయ్యాలి.
ఎనిమిది సఖ్యత్వం. అంటే భగవంతుణ్ణి హితునిగా సన్నిహితునిగా స్నేహితునిగా భావించడం.
తొమ్మిది ఆత్మనివేదన. అంటే భగవంతునికి శరణాగతి అయి ఆత్మార్పణ చేసుకోవడం.’’
No comments:
Post a Comment