కొత్త దారులు
తేది: 24-06-2019
శీర్షిక: మేథో మధనం
సంఖ్య: 219
ఆశ మనిషికి ఆశయాన్ని ఏర్పరిస్తే
ఆలోచన అవకాశాలను చూపిస్తుంది ...
ఆచరణ విధానం గమ్యం చేరిస్తే
అనన్య వైవిధ్యం కీర్తి కిరీటాలను అందిస్తుంది....
సదువులెందుకు సాదుకుంటే చాలాన్నోళ్లు
రాతపూతలమందమైతే చాలు రాజైతడన్నారు...
పది చదివితే చాలు పంతులైపోతావన్నప్పుడు
బతకలేక బడి పంతులా ? అన్నారు.....
తరాలు మారగానే తరీకలు మారినట్టు
ప్రభుత్వ చదువులు చాలవంటూ పడి పడి
ఫక్తు వ్యాపారమై దోచుకుంటున్నారని తెలిసినా .
ప్రయివేటులకై ప్రజలు పాకులాడుతున్నారీనాడు ...
రెండవ ప్రపంచ యుద్దాన దండిగా చితికిన జపాను
ఆలసింపక తేరుకోలేదా ఆదరించి నూతన దారులను
నాణ్యత విలువలు పాటిస్తూ నవనాగరికతను అలరిస్తూ
పతాక స్థాయిన నిలిచింది ప్రపంచ ప్రశంసలు పొందింది...
అభివృద్ధిని ఆశిస్తే అనితర మార్పును ఆహ్వానించు
అకుంఠిత మేధో మదన దీక్ష దక్షతలు ప్రదర్శించు ....
పోటీలో నిలిచి అన్నింటా సాటిలేనిదని నిరూపిస్తూ
దీటైన విలువలు జోడించి మేటిగా నిలువడమే నేటి నిజం....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment