Saturday, June 1, 2019

దశావతార భజన గీతం

దశావతార భజన గీతం 

ఆదిశేషా  అనంత శయనా        
శ్రీనివాసా శ్రీ వేంకటేశా        

క్షీర సముద్ర శయనాధివాసా                  
సుందర రూపా వైకుంఠవాసా     //ఆది //
        
అవనిని బ్రోవ అరుదెంచినావా 
వేద రక్షకా మత్స్యావతారా          // ఆది //

ముని దూషణల విమోచనాయా                        
సుర వందితనే  కూర్మావతారా     // ఆది //  

హిరణ్య బలుల  మదమనచంగా 
వరాహ నృసింహ వామనుడాయె    // ఆది //

ధరణీశులను  వధియించంగా    
పరుషము పొందిన రాముడవు       // ఆది //

ఇన వంశోత్తమ రఘుకుల తిలకా 
కారణ జన్మా  శ్రీ రామ చంద్రా.         //ఆది//

యదుకుల భూషణ యశోద నందన 
ధర్మ రక్షకా  గోపాల కృష్ణా                 // ఆది //

జయ విజయులను కరుణించంగా 
జన్మించితివా భువి పైనా.                 //ఆది//

రాక్షస మర్దన శ్రీ రామదూతా  
అంజని తనయా  జయ జయ హనుమా // ఆది //

No comments:

Post a Comment