Saturday, June 1, 2019

జీవిత నౌక

అంశం-జీవిత నౌక 
తేది 30-05-2019
శీర్షిక- అమ్మ ఆశయం ... 
సంఖ్య - 198

ప్రకృతికే వన్నెలద్దగల పల్లె నా ఇల్లు 
పండంటి అనురాగాల పసిడి కుటుంబం 
ఆత్మీయతలకు ఆనవాళ్ళై వెలసిన ఆనందం  
అన్నదమ్ములు చెల్లెను నింపిన బృందావనం 

పదిమంది తోటిదే జీవితమనే నాన్న 
పశు సంపద ఎవుసం నమ్మిన కుటుంబం  
పట్టుబట్టి అందరిని చదివించిన అమ్మ 
ఊరు వాడ మెచ్ఛే క్రమశిక్షణల కవాతు 

అమ్మానాన్నల ఆశీర్వాద బలం  
అపురూపమై మలిచిన విద్యార్థి జీవితం
అందుకున్నది చేరిన ఆశయాల గమ్యం 
మారిపోతూ నిలిచిన  నాలుగో ఉద్యోగం ... 

అలుపెరుగని ముప్పై తొమ్మిదేళ్ల జీవితం 
అయిదంకెల రొక్కం అంతా సౌకర్యమయం
అయినా గాడి తప్పని జీవిత క్రమశిక్షణం
అచ్చమైన మూడు పువ్వులు ఆరు కాయలు  

అరమరికలెరుగని అమృత వర్షిణి అర్దాంగి 
ఆణిముత్యాల్లాంటి అబ్బాయి అమ్మాయి   
ఆరితేరి చూపారు ఆద్యంతం చదువుల్లో ప్రతిభ
అందిపుచ్చుకున్నారు  ప్రాంగణ నియమాకాలు

అనుకున్నంతలో జరిగాయి కల్యాణాలు 
అమ్మాయికి ఇద్దరు మనవరాళ్లతో 
అలరారుచున్నది మా పొదరిల్లు
ఒకటొకటిగ  ఒద్దికై సేద తీరుతున్నయి...  
అమ్మ ఆశే మా ఆశయ గమ్యానికి చుక్కాని ... 

No comments:

Post a Comment