అంశం - బతుకు పుస్తకం
తేదీ - 05-06-2019
శీర్షిక - మానవ ప్రయత్నం ...
సంఖ్య - 203
విధాత లిఖిత తోరణం
పూర్వ జన్మ కర్మల సంచితం
వింత గొలుపు మనిషికో రకం
రంగులు బొమ్మలు పాఠాలు పుటలు....
కొన్ని ఆనందాలను పంచుతాయి
కొన్ని విషాదాలను నింపుతాయి
కొన్ని విషాలను కక్కి వింత చూస్తాయి
ఇంకొన్ని అమృతాలను చిలుకుతాయి
కొన్ని స్వార్థాల వలలో చిక్కి
ఆంటీ ముట్టనట్టుంటాయి
ఇంకొన్ని సంఘమే దేవాలయమంటూ
తెరిచి స్వాగతిస్తాయి...
సందేహం లేని సహజం
చరిత్ర మాత్రమే చదవవగలం
ఆరాట పడినా రేపటి పేజీ తెరవలేం
అయినా ఆసాంతానికి సహకరించాల్సిందే.....
అనుభవాల పరిశీలనలతో
విరించి వివరాలకే విశుద్ధ
విచక్షణల విలువలు జోడించి
శ్రేష్ఠమైన మానవ జీవితమన్న
సత్యానికి మనవంతు ప్రయత్నం చేద్దాం ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment