అంశం - జీవిత నౌక 2
తేదీ - 29-05-2019
శీర్షిక - నైపుణ్యమైన ఓ నిండు జీవితం....
సంఖ్య - 198
ఇప్పుడంటే కొంత సరేనేమో
కానీ ఒకప్పుడైతే .....
సాగరం ఈదవచ్చు గాని
సంసారం ఈదడం చాలా కష్టం
అనే వారు అనుభవజ్ఞులు...
అవును అక్షరాలా నిజం
అవసరానికందే కుబేర పుత్రులైతే సరే ...
లేదంటే...మనిషి పుట్టుక నుండి చావు వరకు
ప్రతీది ఓ ప్రహసనమే .....
ప్రతిదీ పైసాతో ముడిపడినదే....
మనిషి సంఘ జీవి... మనకొరకు కొన్ని ..
పది మంది కొరకు ఇంకొన్ని చేస్తూ
అప్పుల కొఱవితో తప్పవు తిప్పలు .
పనికి ఒక్కడు ప్రసాదానికి పది మందన్నట్టు
చేసేది ఒకరిద్దరు... మేసేది పదుల మంది
తినడమొక్కటే కాదు ...
పండగొచ్చినా ... పబ్బమొచ్చినా....
రొంప చేసినా ... రోగమొచ్చినా...
అందరికీ అన్నీ సమకూర్చడమంటే........
అగ్ని పరీక్షే కుటుంబ పెద్దకు ....
నగదు డబ్బులు కావాలంటేనే
నగుబాట్లను దాటి రావాలి ....
ఆటు పోట్లు లేకుండా జీవితనౌకను
అవతలి గట్టుకు చేర్చడమంటేనే
నైపుణ్యమైన ఓ నిండు జీవితం....
No comments:
Post a Comment