నగునూరి రాజన్న
అంశం: చుట్టరికాలు
తేది: 13-05-2019
శీర్షిక : మనమూ మారాలి ...
సంఖ్య : 184
ఎన్ని జన్మలైనా
ఎద్దడుగు దూరంలో
ఉండాలనే వారు....
అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు
బావలు, బావ మరుదులు
సాధక బాధకాలల్లో
సావాసముంటారని.....
కలి మాయాజాలమో
కాని కాలం మహిమలో
వాతావరణ కాలుష్యమో ...
వరుసలు పలుసనై పోతున్నై ...
యాంత్రికతతో కొంత
సాంకేతికతతో ఇంకొంత
గ్లోబలై జే షన్ తో చాలా కోల్పోయాం...
డిజిటలైజేషన్ తో ఇంకేమి కోల్పోతామో ?
మానవ సంబంధాలకంటే
మనీ సంబంధమే మిన్నంటూ
మెనూ లేని జీవితాల కొరకై
వలస జీవితాలెక్కువై
వరసలు మరిచిపోతున్నారు....
ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా
మన వంతు పాత్రను
మరింత పటిష్టంగా...
మరెంతో ఓపికతో.... ఒద్దికతో ....
మలినమూఁడ్చిన వరద లాగా....
మనమిప్పుడే మొదలెడదామా...
మనమూ మారాలి కాబట్టి....
సాంప్రదాయమో సంస్కృతో కాదు...
సైన్స్ కూడా అంగీకరిస్తుంది
సమస్యలకు సమాధానం
బలమైన బంధుత్వాలంటూ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment