అంశం - పొదరిల్లు
తేదీ - 22 -05 -2019
శీర్షిక - ఆనందాల నిలయం
సంఖ్య - 192
అమ్మ నాన్నల ఆప్యాయతలకు
అన్నదమ్ముల అనుబంధాలకు
అక్క చెల్లెళ్ళ ఆత్మీయతలకు
అసమాన ప్రేమానురాగాలకు
మమతల మానసం మా పొదరిల్లు ...
ఇరుగు పొరుగులతోను ఇష్టంగా
ఇక్కట్ల సక్కట్లలోన అభయంగా
ఇచ్చి పుచ్చుకోవడాల ఆనందాలెరిగిన
ఇంపైన కోవెల మా పొదరిల్లు ...
అడుగిడిన వారందరికీ
కాదు లేదనకుండా
కలిగినంతలో కాసింత
కలిసి పంచుకున్న సందర్భాలే
కమ్మనైన అనుభూతుల మా పొదరిల్లు ....
కష్టాల కొలిమిలో కాకలు తీరి
ఇష్టాల కోరికల పట్టాలు పొంది
మా నలుగురం మంచి స్థిరం పొంద
మరో నాలుగిళ్లుగా ఫరడవించ
మార్గదర్శియై నిలిచె మా పొదరిల్లు ...
అయినను మా పిల్లల చిన్న చిన్న
అచ్చటా ముచ్చట్లను ఆ ఇంటనే తీర్చుకుంటూ
అమ్మా నాన్నలనెప్పుడు
ఆనందాల అంచున నిలుప
అలరించుచుండె మా పొదరిల్లు....
No comments:
Post a Comment