అంశం - మానవత్వం విరిసింది
తేదీ - 11-06-2019
శీర్షిక - విరిసిన మానవత్వం
సంఖ్య - 208
ప్రతి మనిషిలో నిబిడీకృతమే
పట్టవచ్చు కొంత సమయం సందర్భం...
ప్రయత్నించి కదిలించి మేల్కొల్పడమే
పట్టుదలతో ఏదైనా సాధించడమే ...
అనుకున్నామా లండను బారిష్టరు
అవుతాడని స్వాతంత్య్ర సమరయోధుడు
ఆదరించి శ్రవణ హరిశ్చద్ర చరితలను
అమలు పరిచె నిజ జీవిత మౌన పోరాటాన....
అణచబడ్డ జనవాహిని ఆసేతు హిమాచలాన్ని
అహింస సత్యాగ్రహ ధర్మ మార్గానికి పురికొల్పి
అకుంఠిత దీక్షా దక్షతలను అనన్యంగా ప్రదర్శించి
అంకురింపజేసి నరనరాన మానవత్వ పరిమళాలను....
నీతి నిజాయితీలే ఉఛ్వాస నిచ్వ్వాసలుగా
ప్రాణ నష్టమెరుగని స్వాతంత్య్ర సమర శీలతతో ....
అజరామరమై నిలిచె కదా... అనంత విశ్వ చరితన ...
అలరారుచుండె పాఠ్యంశాలై అనేక విశ్వవిద్యాలయాల్లో....
అమలు పరుస్తున్నరు శిక్షణ తరగతులుగ
అనేక కార్పొరేట్ కార్యాలయాల్లో ....
విరిసిన మానవత్వానికి మచ్చుతునక ... విజయునిగా ...
అల్బేనియాలో పుట్టిన ఆడపడుచు
ఆపన్న హస్తమందించి నిలిచె కదా....
మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ నెలకొల్పి
అంటరాని అనారోగ్యాల బారిన పడిన
అనేక దేశాల ఆకలి గొన్న అల్పాదాయులకు
ఆమె కదా... విశ్వశాంతి మాతై వెలుగొందే
విరిసిన మానవత్వానికి విశిష్ట మార్గదర్శిగా.
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment