Saturday, June 1, 2019

ఇష్టాయిష్టాలు

అంశం - ఇష్టాయిష్టాలు
తేదీ- 16-05-2019
శీర్షిక - ఇష్టాయిష్టాలు
సంఖ్య -187

రాజ కుటుంబమైనా .... 
రాళ్లు కొట్టుకునే కూలీ అయినా 
అమ్మాయి పుడితే  ఆదిలక్ష్మే సుమా... 
ఆడ దేవతల పేర్లన్నీ వల్లె వేస్తారు... 
అమ్మానాన్నల వద్ద ఉన్నంత వరకు 
ఇంటిల్లిపాది  ఇష్టాయిష్టాలు
ఆ అమ్మాయి కనుసన్నల్లో .... 
అదే అమ్మాయి పెళ్లయి అత్తారింటికి వెళితే 
ఆమె ఇష్టాయిష్టాలుకు ఇక ఫుల్ స్టాపే .... 
ఆరంభంలో అత్తా మామల మాట 
తదనంతరం భర్త... పిల్లలు  
ఆ వెనక బాధ్యతల మూట 
అటునుండి ఇటు మారితే... 
పెద్దరికమొస్తుంది కానీ...  పేరుకే... 

అహరహరం కష్టాల కుంపట్లు....
అలి తేరినా తీరని దాహం....   
మినహాయింపు లేదు ఏ తల్లి తండ్రులకు  
కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి 
కన్న పిల్లలన్న కనికరం లేకుండా 
పిల్లల ఇష్టాయిష్టాలకు 
పిసరంత విలువనివ్వక 
కార్పొరేటోళ్ల కబంధ హస్తాల్లో పెట్టి 
పెనుగులాటలు మనకు ....   
పేరు ప్రతిష్టలు వాళ్లకు .... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

No comments:

Post a Comment