Saturday, June 1, 2019

ఓపిక, ఒద్దిక మీ పేర్లు

అంశం - ఓపిక, ఒద్దిక మీ పేర్లు
తేదీ - 23-05-2019
శీర్షిక - మనమూ చేద్దాం 
సంఖ్య - 193

అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ  
అందరు అమృతం చిలికే అమ్మలే..... 
అక్క, చెల్లె, కూతురు,కోడలు  
అందరు అనురాగాల సిరి మల్లెలే ....  

అమ్మింట్లో మురిపాలు ఎంతో.... 
అత్తింట్లో బాధ్యతలు అంత ... 
అయినా అమురును సహనం 
అమలు పరచు సౌశీల్యం.....  
అదే ఆ దేవ దేవుని వరం.... 

అనాదిగా అనుభవిస్తున్నాం 
ఆడవారి ఓపిక ఒద్దికల సపరిచర్యం 
అడుగడుగున వేదికలపై మెచ్చుకుంటాం 
అయినా తగ్గదు పురుషాధిక్యం 

ఆధునికత ఒప్పుకుంటాం ... 
అన్నింటా అతివ మెప్పినా... 
అమలుకెందుకో ఆలస్యం ... 
ఆడవారి కోటా అన్నింటా సగం. 

మనువును చెండాడుదాం 
మనసు మాత్రం కరగనీయం 
మందిని ఆడిపోసుకుందాం 
మనం చేసేది మాత్రం శూన్యం ..

No comments:

Post a Comment