Saturday, June 1, 2019

భావ తరంగాలు 2

అంశం - భావ తరంగాలు 2
తేదీ 24-05-2019
శీర్షిక - మరి సర్కారెందుకు ? 
సంఖ్య - 194

రక రకాల కల్తీ కాలుష్యాలు కోరలు చాచగానే 
రక్షక మంచినీరంటూ రయ్యిమని వచ్చే..  
రక రకాల కంపెనీ  నీళ్ల సీసాలు సంతలోన ....
అంతలోనే ఆస్టియో పోరాసిస్  అంటూ 
విటమిన్ డి లోపమంటూ వివరించ విజ్ఞానులు
విధి వక్రతను జనం ఆడిపోసుకుంటుంటే ... 
విరివైన అమ్మకాలు  ఫార్మసీ వర్తకులకు .... 
విందు లాంటి పన్నులు ఆ పై వడ్డనకు ....  

అస్సాం మణిపూర్లలో అయోడిన్ తగ్గితే 
అంతటా దేశాన అదే  ఉప్పందించి  
అనవసరాన  థైరాయిడ్ వ్యాధుల వ్యాప్తి...   
ఆనక గగ్గోలు దేశ జనాలు ఆసుపత్రుల చుట్టూ ... 
ఆనవాళ్ల జాడల్లో అలసత్వపు అధికార్ల బేజార్లు 

అంతవరకు మొద్దు నిద్ర అధికార గణాలకు...  
అలగా నేతల, రక్షకుల పోగులకే గమనాలు, గమ్యాలు...  
ఆనక  ఆగమాగం జగన్నాధం సర్కారులు   
సామాన్యుడు చచ్చిపోతుంటే తకరారు చూస్తుంది సర్కారు .....
వేల కోట్లు ఖర్చుపెట్టి సర్కారును ఎన్నుకుంటే 
వేలమేసి వర్తకులకు సంపద కట్టబెడుతుంటే 
మరి సర్కారెందుకు ?

No comments:

Post a Comment