Saturday, June 1, 2019

నెలవంక

అంశం - నెలవంక 
తేదీ- 29-05-2019
శీర్షిక - మన చందమామ 
సంఖ్య-  197 

అమ్మ చేతి గోరుముద్దల ఆనందాల  గమ్యమై 
అందరికి అందమైన చల్లని మామై నిలిచాడు ... 
శుక్లమందు సుందరమై పున్నమి వెన్నెలలు...  
కృష్ణమందు క్షీణిస్తూ  అమావాస్య చీకట్లు..... 

విదియ తదియల గోచరించు నెలవంక 
విశిష్ట దర్శనమై నిలిచె  విజ్ఞులకు నాడు.... 
కాంక్రీటు జంగల్లలోన  కానరాదు ఈనాడు 
కరిమబ్బుల చల్లదనపు కమ్మనైన చందమామ ... 

కాల గమన ప్రమాణాల లెక్కింపుల్లో కలికితురాయి 
కాలండర్ పంచాంగపు ప్రపంచాన మైలురాయి ... 
నక్షత్ర కదలికల సంబంధాలను విశదపరుస్తూ 
మీన మేషాల గణన పండితులకు మూలాధారం .... 

ఆత్మ నమ్మకంతో అడుగిడిన శాస్త్రజ్ఞులకు  
ఆది గురువై తోడుగ నిలిచింది .... 
అంతరిక్షపు వింతల శోధనలో 
అన్నింటా మానవున్ని పురికొల్పింది... 

విశ్వ జగత్తులో వినీలాకాశంలో 
విరివైన  చంద్రమలెన్నున్నా 
భూమాతకు అనుంగు సోదరుడై  
మనందరికీ ఉన్న మామ ఒక్కడే..... మన చందమామ! 

No comments:

Post a Comment