Saturday, June 1, 2019

చిరునామా

అంశం - చిరునామా 
తేదీ - 28-05-2019
శీర్షిక - ఆధార్ చరవాణీ  మేల్ ఐడిలే  .... అన్నింటికీ 
సంఖ్య - 

మనిషి మనిషికీ ఆత్మీయతలు 
వావి వరుసల పల్లె పిలుపులు 
మంచి చెడులకు మంది మార్భలం 
మన జాడలు ముదముగ తెలియంగ !

పల్లెలన్నీ పట్నాలౌతుంటే 
ప్రజలంతా సముద్ర హొరౌతుంటే 
పక్కింటి  వివరాలే దుర్లభమౌతుంటే  
పనికొచ్చేది పక్క చిరునామానే మిత్రమా !

చేతివృత్తులు మాయమై 
కుటీరపరిశ్రమలు కుంటుపడి 
పారిశ్రామికీకరణ ఫరిఢవిల్లగానే 
పని ప్రదేశాలు మారుతుంటే.... 
ప్రముఖంగా మారేది చిరునామానే ...సోదరా ! .  

బార్టర్ బతుకులు మాయమై 
నగదు మార్పిడి మసకబారి 
ఆన్లైన్ విధానాలకు అనువైన 
వాణిజ్య బ్యాంకులో ఖాతా తెరవాలన్నా...   
అందుబాటైన ఫోనులోకి  సిమ్ కావాలన్నా ....   
మార్పు సహజమైన మన ప్రపంచం లో 
పాలనా విధానాలకు మినహాయింపేమి కాదుగా... 
అడ్రస్ అంటూ ఉన్నా లేకున్నా 
ఆధార్  చరవాణి  అన్నిటికన్నా మిన్నై
మేల్ ఐడిలే  మేలైన రుజువులయ్యాయి నేస్తమా ! 

No comments:

Post a Comment