Wednesday, June 11, 2025

ప్రకృతి తేదీ : 31-08-2024 శీర్షిక : కనుమరుగే మేలుకోకుంటే ... .

 ప్రకృతి 

తేదీ : 31-08-2024
శీర్షిక : కనుమరుగే మేలుకోకుంటే ... . 

ప్రాణులకు  మూలం ప్రకృతి 
పచ్చగా వెలిగిపోవాలన్నా 
వెచ్చగా ఆనదించాలన్నా 
శ్వాసగా అందించాలన్నా .... 

జీవరాశికి మూలమై 
ఆణువణువూ వ్యాపించిగా 
ఆమూలాగ్రం ఆస్వాదిస్తూనే 
రాక్షత్వం పొదువుకుంటున్నారు ... 

అవసరానికి మించి 
హననం చేస్తూ అత్యాశల 
పేరాశల పల్లకీలో ఊరేగుతూ 
పెట్టె నింపుకుంటున్నాడు ... 

చెట్టూ గుట్టా వాగు వంకా 
ఇసుకా మట్టి రాయి అన్నింటిని 
చెరబట్టి హాహాకారాలు చేస్తూ 
రాక్షాసానందం పొందుతున్నాడు ... 

తాను చేసే చెడు పరులకనుకుంటాడు 
బూమరాంగై బుగ్గి పాలు కాకముందే 
కళ్ళు తెరిస్తే సరే సరి…లేదంటే 
కనుమరుగే జీవరాశి ...మేలుకోకుంటే ... . 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment