చెన్నై
తేది : 22-08-2024
శీర్షిక : పుణ్యభూమి
ఘనమైన పట్టణ చరిత్రను
మననం చేసుకోవాలనే ఆశతో
2004 నుండి ఆచారమైంది
ఆచరణకొచ్చింది దినముగా ...
ఊరు పేరు అక్షరాలలో
ఏత్వం లాగే ... మనుషులలో
మాతృభాషపై పైత్యం ఎక్కువ
మోతాదు ఉన్నదనే ఉవాచ ...
వందలేండ్ల చరిత్రతో
వర్థిల్లుతున్న నగరం ...
నాడు తెలుగు వారి పాలనే
నేడు తెలుగు మూలాల
తంబి పరిపాలనే ప్రస్తుతం ...
పల్లవులు పాండ్యులు చాళుక్యులు
చోళులు నాయక రాజులు పాలించిన
దాఖలాలు ... పోర్చుగీసు వారు
డచ్ వారు ఆంగ్లేయులు పాలించిన
ప్రాంతం ...
తెలుగు తమిళ భాషల సంస్కృతితో
పేరొందిన ఆలయాల పెన్నిధిగా
శిల్పకళలకు సజీవ సాక్ష్యమై
వేల వత్సరాల వేలుపుగా నిలిచింది ...
అనేక కర్మాగారములకు నిలయమై
పారిశ్రామిక ప్రగతిలో ఎన్నో మైలు
రాళ్లకు ప్రసిద్ధమై పదిల పరుచుకుంది
చరిత్ర పుటలలో ...
ఇడ్లీ సాంబారుకు ఇగురుబోణి
దక్షిణ భారత భోజన విధానాలతో
వరి అన్నమునకు వరిష్ఠమై
పురి వేసినది పుణ్యభూమిగా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment