చిత్ర కవిత
శీర్షిక - చీకిపోయిన బుస్సు
తేది : 28-07-2024
నాయకుల పరుగు కార్లలో
పేదల బతుకు బస్సుల్లో ...
అదీ చీకిపోయిన ఎర్రబస్సు
అవగతమైతే అంతే చాలు ....
పడిపోయింది ప్రయాణీకుడా ?
క్రమశిక్షణా రాహిత్యమా ?
అధికారుల అలసత్వమా ?
నాయకుల వారసత్వమా ?
కళ్లెం లేని ప్రజల అత్యాశలా ?
అయినా అడ్డదారి చెడ్డదారి
అని చెప్పకనే చెప్పింది....
వరుసలో రావాలనే
క్రమశిక్షణలే లేని రవాణా .....
రీల్స్ చేస్తున్నారో
రియల్ అవసరమో
కాళ్లు చేతులున్న కబోదులకు
కాలం చెప్పిన జవాబు .....
ఉచితాలంటూ ఊరేగిస్తూ
ప్రజలను తప్పు తోవలు
పట్టిస్తున్న ప్రజానాయకులు
పరిశీలించుకోవాలి మనఃసాక్షిని ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment