పేపర్ బాయ్
తేది 04-09-24
శీర్షిక : గొప్ప మార్గదర్శి
సంఘటనల సమాహారాలను
సుమహారాలకన్నా ముందుగానే
సూర్యోదయంకన్నా మున్ముందు
సరజంజామాగా సర్దుకుని
తాజాగా వడ్డించే వార్తల వారధి ....
పని పాటల పల్లవిగా మొదలై
జీవితంపై ఆశలు కల్పించే
కల్పవృక్షమై... బాల్యాన్ని భద్రంగా
తీర్చి దిద్దే కాయకష్టం తెలిసిన సద్గుణశీలి
స్వావలంబనకు సంకేతమై
పట్టుదలలకు పుట్ట తేనెలా
జీవిత మాధుర్యాలను రుచింప
చేసే గొప్ప మార్గదర్శి ....
బహుభాషల భుజకీర్తుల్లో
ఎవరెవరికి ఏమి పేపరో కావాలో
జ్ఞాపకాల దొంతరను గాలిస్తూ
గజిబిజిలకు గాలమేసే గమ్మత్తు
ప్రక్రియ ....
ఎండా వానా చలి కాలాలలో
స్థితప్రజ్ఞతల చిరాయువుగా నిలి చి
కుటుంబాలకు టార్చ్ బేరర్ గా
కుంటు పడని వ్యవస్థలకు మూలం.
ఆకాశంలో అంతరిక్షం దాకా ఎదిగి
పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంటు వరకు
రామేశ్వరం నుండి రాజ్ భవన్ వరకు
రంజిల్లిన మన అబ్దుల్ కలాం గారే
ఘన ఉదాహరణ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment