Wednesday, June 11, 2025

రక్షా బంధన్ తేది : 18-08-2024 శీర్షిక : తోబుట్టువుల తోరం

 రక్షా బంధన్  

తేది : 18-08-2024
శీర్షిక :  తోబుట్టువుల తోరం 

అమ్మ గుడిని ఒడిని పంచుకున్నాం 
ఒకే రుధిరం ప్రవాహమైనది 
ఒక్క గూటిలో ఒదిగి పెరిగాం 
అమ్మ ముద్దులు కలిసి పంచుకున్నాం 
అమ్మ ముద్దలు కలుపుకుని  తిన్నాం 
అమ్మ ప్రేమలో మునిగి పోయాం ... 

అడుగు అడుగు కలిసి ఆడుకున్నాం 
చేయి చేయి కలిపి బడికి నడిచాం 
ఆటలలో పాటలలో చిలిపి అల్లరి చేసాము 
ఒకరికొకరం అండదండలైనాము .... 

సమతా మమతలు పంచుకున్నాం 
చదువు సంధ్యలు నేర్చుకున్నాం 
తోబుట్టువులమై తోరపు బంధమైనాము 
అక్కా తమ్ముళ్ళమైన అన్యోన్యతలు .... 

అక్క ముఖంలో వెలుగులు పూసాయి
దరహాసంతో తమ్ముడు ప్రదర్శనం ... 
మురిపమైన పండగ రాఖీపౌర్ణమిన 
ముద్దుముద్దుగా రక్షన బంధనం…. 

ద్రౌపదీ కృష్ణుల జ్ఞాపకం 
సంస్కృతి సంప్రదాయం 
సమున్నత ఆచారం 
సర్వేజనా సుఖినోభవంతు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment