Wednesday, June 11, 2025

గోకులాష్టమి -- చిత్ర కవిత తేదీ : 26-08-2024 శీర్షిక :కృష్ణ లీలలు

 గోకులాష్టమి -- చిత్ర కవిత 

తేదీ : 26-08-2024
శీర్షిక :కృష్ణ లీలలు

చిన్ని చిన్ని పాదాల చిలిపి కృష్ణుడు 
చిరునవ్వులతో అడుగిడినాడు ..... 
నంద యశోదల  ఆనందాలు  
నింగినంటే పౌర్ణమి వెన్నెలలా .... 

అడుగుతీసి అడుగు వేసినా 
అపురూపమే అమ్మ యశోదకు ... 
దాగుడుమూతల దండాకోలే 
గొల్లభామల మనోల్లాసము .... 

పాలు పెరుగు మీగడలు వెన్న 
పదిలంగా దొంగిలించేనే .... 
చిలిపి ఆటల చిద్విలాసం 
గోపాలురతో స్నేహబంధం... 

మనసును దోచి మమత పెంచగా 
మాయా మోహన రాధాకృష్ణుడు ....  
చిలిపి ఊహల మనోల్లాసం  
గోపెమ్మలతో ప్రేమబంధం ... 

అష్టభార్యల ఇష్టసఖుడు 
ఇద్దరమ్మల ముద్దు బిడ్డడు 
కర్త కర్మ క్రియగా అంతా తానై 
నిలిచెనే ఆదిమధ్యాంతరహితుడు .... 

కారణజన్ముడు కామిత మోక్షకుడు 
కౌరవ లంకా గృహదహన కాలమున
పాండవ సంరక్షకుల తిలకా …. 
కంస చాణూర మర్దనం....కమల నయనం… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment