Wednesday, June 11, 2025

కలం గళం - లలిత గేయాలు తేది : 03-08-2024 శీర్షిక : పోరాట వీరులు

 కలం గళం - లలిత గేయాలు

తేది : 03-08-2024
శీర్షిక : పోరాట వీరులు 

వినుడి వినుడి చరితలను 
వింత గొలుపగ  విఖ్యాతమే .... 
కనుడి కనుడి కనువిందుగా 
కమ్మని మన పూజ్యుల కథలను ..... 

లాల్ బాల్ పాల్ అంటూ  
రమ్యమైన త్రిమూర్తులు .... 
రాజీలేని పోరాటములే  
మాతృభూమి శృంఖలాలకు .... 

మన్యంలో మణికొండ 
తిరుగులేని మా రామరాజు 
అల్లూరిగా ప్రఖ్యాతమే 
ఝల్లుమన్న ఆంగ్లేయులకు  ..... 

వినుడి వినుడి చరితలను 
వింత గొలుపగ  విఖ్యాతమే .. 

శభాషంటూ మెచ్చుకోల్లే 
సుభాష్ చంద్ర  గారిని .... 
బోసుబాబుగ  సుపరిచితమే 
ఆజాద్ హింద్ ఫవుజుగా .... 

అర్ద రాజ్యం దాటగానే 
అదిరిపోయిన తెల్లోడు .... 
సుదురుకునే  కపటంగా 
అప్పజెప్పే అహింసావాదులకు .... 

వినుడి వినుడి చరితలను 
వింత గొలుపగ  విఖ్యాతమే ... 
కనుడి కనుడి కనువిందుగా 
కమ్మని మన పూజ్యుల కథలను ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment