Tuesday, June 17, 2025

కవన రవళి 05-09-24 నానీలు

 గురువు నానీలు.  కవన రవళి 

 05-09-24 నానీలు

అమ్మనాన్నలైనాక 
ఆది గురువు
నీవె కదా 
 బతుకు బాటకు… 

 మట్టి మనుషుల 
మర బొమ్మలుగా 
తీర్చిదిద్దె 

 జ్ఞాన నేత్రము… 
 శిలలను  శిల్పంగా 
మలిచే చిరునవ్వుల 
జ్ఞాన కాంతులు…

 చేతికి సుద్దముక్క 
ఆరోవేలయింది 
మాచే అక్షరాలు 
 దిద్దించగ… 

 అమ్మ ప్రేమను 
నాన్న బాధ్యతలను 
రంగరించి 
 నేర్పించును… 

చీకటి తెరలు 
 తొలిగించు… 
వెలుగు రేఖలు 
పంపించి… 

 జ్ఞానామృతం 
 తాగాడేమో… 
 కొసరి కొసరి 
 వడ్డిస్తున్నాడు…. 

 మేదో దుక్కి 
దున్ని చల్లుతాడు … 
అన్ని దిక్కులా 
అక్షర నక్షత్రాలు… 

 గడ్డి పూవులకు 
సైతము..విద్యా 
పరిమళాలను 
అద్దుతుంటాడు…

 మనుష్య దేహానికి
 శ్వాసలాగా… 
 మేదస్సుకు 
 బోధ పోస్తున్నాడు.


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment