Tuesday, June 17, 2025

వినాయక చవితి తేది : 07-09-2024 శీర్షిక : గజముఖవదనుని పండగ ....

 వినాయక చవితి 

తేది : 07-09-2024
శీర్షిక : గజముఖవదనుని పండగ .... 

పురాణాల పుణ్యమైనా 
మహోన్నతమైన చరితం ... 
వైవిధ్యమైన రూపమైనా 
సమున్నతమైన కారణం .... 

నలుగు పిండి జననమైనా 
అమ్మ మాట జవదాటడు ... 
ఆనవాలు తెలియకనే 
అసలు యుద్ధం నాన్నతో .... 

సవాలును  స్వీకరించినా 
సమస్య పరిష్కరించె లౌక్యంతో .... 
ఆది దంపతుల ఆశీస్సులతో 
ఆది పూజ్యునిగా వరమందె... 

ఉత్సవమేదైనా సరే 
ఉన్నతంగా ముందు పూజలు ... 
పత్రితో పూజించినా సరే 
భక్తిని గుర్తించడమే .... 

బాధ్రపద శుద్ధ చవితి 
బహుగొప్ప పండగ 
గణపతి బప్పా పుట్టినరోజుగా 
గజముఖవదనుని పండగ .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment