గ్లోబలి
తేది : 04-09-24
శీర్షిక : విశ్వమానవ కళ్యాణం కోరాలి
సహస్రాధికం
గోడమీద బల్లిలాంటి బతుకు
కాకుండా... భూమండలం
ఆమూలాగ్రం ఉన్న వనరులను
ఉపయోగించుకుని సౌకర్యాలు
పంచుకుని సమున్నతమైన
జీవితవిధానం వైపు అడుగేయడం ...
ప్రత్యక్షం పటాటోపంగా ఉన్నా
పరోక్షములో పారేశాన్లు చాలానే.. .
చీకటి వెలుగుల్లా ... సుఖదుఃఖాలు
కష్ట నష్టాలు కలబోసుకున్నాయి ....
అనాదిగా వస్తున్న ప్రాంతీయ
శ్రమ దోపిడీకి బదులుగా....
ప్రపంచ శ్రమదోపిడీకి శ్రీకారం
అవుతూ కొన్ని గల్లాపెట్టెలు
నిండుతున్నాయి ...
అనురాగాల పందిరి లాంటి
చిన్నా చితక వ్యాపారుల పొట్ట
కొట్టి ఆత్మీయత లేని కార్పొరేట్
దందాలతో కలేజా చూపి
కాలరెగిరేస్తున్నది ....
పదుల మందిని కొట్టి ఒక్కడు
పొట్ట పోసుకోవడం విడ్డూరం ...
మనుషులు మోసపోయే చోట
దేశాలే మోసపోతూ నెత్తి నోరు
బాదుకుంటున్నాయి ....
మార్పు ఏదైనా మహోన్నతానికి
దారి వేయాలి ... మానవత్వాన్ని
బొట్టు పెట్టి పిలవాలి ... బలి
కోరితే బతుకుదెరువు ఎక్కడుంటుంది
విశ్వమానవ కళ్యాణం కోరాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment