Wednesday, June 11, 2025

ఫొటోగ్రఫీ తేది :20-08-2024 శీర్షిక : మంత్రాల పెట్టె

 ఫొటోగ్రఫీ 

తేది :20-08-2024
శీర్షిక : మంత్రాల పెట్టె 

ఫ్రెంచిలో బైలెల్లినా 
గ్రీకుభాషలో బోధించినా 
వందలేండ్ల కృషి దాగినా 
వరసంపత్తియే ఈనాడు ... 

తెలుపు నలుపుల చిత్రమై 
తొలి నడకలు నడిచినా 
సప్తవర్ణాల సరాగమై 
గుప్తంగా మనసు దోచింది ... 

మరిచిపోలేని మహోన్నత 
ఘట్టాలను మళ్ళీ మళ్ళీ 
తరిచి చూసుకునే వెసులుబాటు 
కల్పించి తరించింది .... 

ఖరీదైన ఖద్దరు మడతలా 
కొన్ని రోజులు ఫోజు కొట్టినా 
డిజిటల్ ప్రపంచంతో 
సామాన్యుని చేరువయ్యింది ... 

మనుషులంతా చేరుకోలేని 
మహిమాన్వితాలను కూడా 
మది దోచుకునే విధంగా 
భద్రపరిచి చేరువ చేయగల 
మంత్రాల పెట్టె అది ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment