Wednesday, June 11, 2025

మనసు పాడే పాట తేది : 29-08-2024 శీర్షిక : స్థిత ప్రజ్ఞత

 మనసు పాడే పాట 

తేది : 29-08-2024
శీర్షిక : స్థిత ప్రజ్ఞత 
సహస్రాధికం .... 

ప్రతి క్షణమొక చిత్తం 
ప్రతి నిమిషం ఒక లక్ష్యం 
పరి పరి విధాలా పరుగెత్తే 
అశ్వం ...గాలి కన్నా వేగం ... 

వెలుగుపూలు విరిసినా 
ఆనందనర్తనం చేసినా ... 
చీకటి కోణం ముసిరినా 
దుఃఖపు ఛాయలు విసిరినా ... 

చర్యకు ప్రతిచర్యలా 
చెట్టాపట్టాలేసుకుంటుంది ... 
నవరసాలను రంగరించి 
రసధునిలో నర్తనం చేస్తుంది ... 

ప్రమోదమయినా విషాదమైనా 
పరవశమైనా విషణ్ణమైనా 
భావంతోనే నిండు భరిణె
రాగంతోనే మెండు గానం .... 

పాటేదైనా ప్రజ్ఞత ప్రదర్శించాలి 
భావమేదైనా స్థితప్రజ్ఞత పాటించాలి 
రాగమేదైనా రక్తి కట్టించాలి 
అంతిమంగా మానవాళి కళ్యాణం 
కోరాలి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment