హృదయ మాధ్యమం
తేది: 20-08-2024
శీర్షిక : మానవత్వం .....
పలకరింపులో శంఖారావమై
పరవశాలకు మూలమౌతుంది ....
పరిమళాలు విరజిమ్ముతూ
పదుగురికి ఆనందాలు పంచుతుంది ....
మంత్రించిన మరయంత్రంలా
ఎదుటి మనసెరిగి మసలుకోవడం....
నిరాడంబర నిజ స్థితికి అనుకూలమై
నిర్మలమైన జీవన మార్గానికి నాందీ
పలకడం ....
మమతకు సమతకు ఘనమైన మరో రూపం
మానవతకు మహోన్నత చిహ్నం
ఆత్మీయతకు అనురాగానికి సంకేతం
అనుబంధాలకు అపురూప సన్నివేశం ...
హృదయ స్పందనలే మానవత్వం
అది లేకుంటే మృగాలకన్నా హీనం ....
సంపదలెన్నున్నా సాధించలేని శాంతికి
ఆత్మజ్ఞానమే ఆఖరి అస్త్రమని గీత బోధన ....
బుద్బుదప్రాయమైన ఈ జీవితానికి
ఆత్మజ్ఞాన సముపార్జనే ధ్యేయమవ్వాలి ...
జీవిత అనుసంధానమైన భక్తిభావంతో
భగవంతుని ఆశ్రయం పొందాలి ....
జీవరాశిలో మిన్నని వితండమే గాని
భావరాశిలో వెనకపడి పోతూనే ఉన్నాడు ...
కలిమాయల కవాతులేమో గాని
రాను రాను రాక్షత్వం పొదువుకుంటున్నాడు ....
పెరుగుట విరుగుటకంటారు ...
పెరిగిన చెడంతా విరిగి ఇక మంచి పెరగాలని
మనసారా కోరుకుందాం …
మనిషిగా మానవత్వాన్ని చాటుదాం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment