Wednesday, June 11, 2025

చిత్ర కవిత తేది : 25-08-2024 శీర్షిక : ఆదిమధ్యాంత రహితా

 చిత్ర కవిత

తేది : 25-08-2024
శీర్షిక :  ఆదిమధ్యాంత రహితా 

దేవకీ వసుదేవుల సంతానమై 
యశోద నందునింట పెరిగిన కన్నయ్య  ... 
మధురలోన జన్మించి మర్మముచే 
రేపల్లెకు చేరితివి వింతగాను .... 

అష్టమ గర్భం అష్టమి తిథి 
అష్ట భార్యల ఇష్టసఖుడా ! 
ఆదిమధ్యాంత రహితా   .... 
ఆయుధమే ముట్టకుండా 
అణచితివి  దుర్మార్గులను ... 

పాలు మీగడల వెన్నదొంగవై  
పడతుల వస్త్రములు దాచితివి ...  
నందనందనా  శ్రీకృష్ణా  
కారణ జన్మా  కంస సంహారా  .... 

బాల్య చేష్టల తోడ బంగారు 
బంధములే గోపెమ్మలతో .... 
మిత్రబృందమును సదా 
రక్షిస్తూ రక్తి కట్టించావు కథలు ... 

ఆటపాటల మన్ను తిన్నా  
అమ్మ ప్రశ్నిస్తే నోట ముల్లోకాలు 
చూపిన మురళీధరా ముద్దుకృష్ణ 
ఇంద్రగర్వ భంగ సూత్రధారి
కుంతీ పుత్రుల రక్షపాలకా ! .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment