సాంగత్య సౌరభం
తేది: 22-08-2024
శీర్షిక : కుసుమ పరిమళాలు
గిరి కోనలలో రవి కాంతికి
అరవిరిసిన కమలంలా
విచ్చుకోవాలి ... కలువభామలా
ఒక్కటనే భావన కలగాలి....
కుంటి కూని రాగాలు తీసినా
కుసుమ పరిమళాలు
విరియాలి ...గుండు మల్లెల
గుబాళింపులు కురిసి మెరవాలి
చిన్న చిన్న మచ్చలున్నా
చిరు దివ్వెలాంటి పండువెన్నెల
సొన వెదజల్లాలి... పిండారబోసిన
చందంగా వెలుగులు ప్రసరించాలి ...
చిమ చిమ లాడినా సిరి గంధం
చల్లినట్లుగా ఆఘ్రాణ యోగ్యమై
చల్లని పన్నీరులా మలయమారుతమై
మాతృమూర్తి స్పర్శలా ఆనందించాలి ....
ఆత్మీయతలు కలబోసుకుని
అనురాగాలు వెదజల్లుకుని ....
తొలకరి ఆనందాలను మూట
కట్టుకుని మురిపాలను కురిపించాలి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment