Wednesday, June 11, 2025

ఎడిటింగ్ తేది 24-08-2024 శీర్షిక : సవ్య దిశ

 ఎడిటింగ్ 

తేది 24-08-2024
శీర్షిక : సవ్య దిశ 

కవితైనా కథలైనా 
కథనం పద్దతిగా 
సాగితేనే ....మృష్టాన్న భోజనం 
కాదంటే విషన్నమే ... 

అక్షరాలు  దుమికేతే 
లక్షణమైన  భావము .... 
దోషముతో భాష్యమైతే 
గోసనే చదువరులకు .... 

అవక తవకలైతే 
అడవికాచిన వెన్నెలే ... 
చవకబారు భావంతో 
చీకి పాకాన పెట్టు..... 

ఎడిటింగ్ తోనే 
ఎకాఎకి వెండితెరలలో 
దండి దొరగా సినిమాలు 
విజయించిన దాఖలేలెన్నో 

చూచినవి విన్నవి 
ఇతరులకు సొంపుగా 
చెప్పే విధానమే 
సముచితమైన సంబరం ... 

ముఖ్యంగా 
దినపత్రికలలో 
టి వీ లలో వచ్చే  వార్తలు 
లేదంటే తిప్పలే .... 

ఫోటోలలో ఎడిటింగ్ 
ఫోజులలో  విభిన్నం 
ఎన్ని మాయలైనా చేయొచ్చు 
ఉచితమైన విధానం 
ఉల్లాసాల సంతోషాలకు.... 

తప్పుడు మార్గాలైతే 
తప్పదు తిప్పలు 
చట్టపరమైన చర్యలకు 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment