Wednesday, June 11, 2025

గిడుగు రామమూర్తి పంతులు తేది : 15-08-2024 శీర్షిక : వ్యవహార భాషా పితామహుడు

 గిడుగు రామమూర్తి పంతులు

తేది : 15-08-2024
శీర్షిక : వ్యవహార  భాషా పితామహుడు 

అచ్చ తెలుగు చిచ్చరపిడుగు 
వ్యవహార భాషా ఉద్యమ పితామహుడు 
గ్రాంధీకము నుండి విముక్తి గొలిపి
సార్వజనీనతకు కృషి చేసాడు… 
(సర్వజనులకు చేరువ చేసాడు....)

బహుభాషా కోవిదుడు బహుముఖ 
ప్రజ్ఞాశాలి ... చరిత్రకారుడు 
సంఘ సంస్కర్త ...  వ్యావహారిక 
భాష ప్రాణంగా చేసుకున్నాడు ... 

విందు భోజనం లాంటి 
గ్రాంథీకంతో పాటు  నిత్య 
భోజనంలాంటి వ్యవహారిక భాష 
కూడా... అమ్మ చేతి గోరు ముద్దలా 
కమ్మని రుచులేనని కంకణం 
కట్టుకున్న ఆనాటి పెద్దలు .... 

గురజాడ, గిడుగు, శ్రీనివాస 
అయ్యంగారు, యేట్సు   నలుగురు 
నాలుగు పిల్లర్ల వలె నిలిచి 
భాష బతకాలని
నాలుగు కాలాలు నిలవాలని 
కంకణం కట్టుకున్న ఘనాపాఠీలు....  

ఆంద్ర సాహిత్య పరిషత్తు సభలో 
అనన్యమైన రీతిలో గంటల పాటు 
ఉపన్యసించి తగిన ఆధారాలతో 
తనవాదాన్ని ఒప్పింపజేశాడు .... 

సవర భాష లిపి ప్రదాత... వారి  
భాషా సేవలపై పరిశోధనలెన్నో ... 
వాడుక తెలుగు భాషకు స్ఫూర్తి ప్రదాత 
గిడుగు వారు గ్రాంధీకం నెత్తిన పిడుగని 
తెల్లని పాల మీగడని 
భాషకు గొడుగని పెద్దలెందరో 
కొనియాడారు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment