Wednesday, June 11, 2025

అనగనగా కాలం తేది : 03-08-24 శీర్షిక : అమృతభాండం

 అనగనగా కాలం

తేది : 03-08-24
శీర్షిక : అమృతభాండం 

అనగనగా కాలమే అమృతభాండం 
ఆత్మీయతలతో ముడివేసుకుని 
మల్లెపరిమళాలు వెదజల్లుతూ 
పందిరికి అల్లుకున్న దాఖలాలే .... 

కష్టాలెన్ని పలకరించినా 
కలిసి ఉంటె కలదు సుఖమంటూ 
మనోధైర్యంతో ఎదిరించి 
పోరాడి గెలిచిన దాఖలాలే ... 

కాఠిన్యమెంతగా మొట్టి 
గడ్డుకాలం ఎంత ఎదురొడ్డినా  
బంధాల ప్రేమలో పోరాడి 
గెలిచిన నిలిచిన దాఖలాలే ... 

ఆత్మీయతలతో అంకురించి 
అనురాగాలతో అల్లుకుని 
అనుబంధాలతో శుభ మాలికలై 
ఆప్యాయతలతో పరిమళాలు 
వెదజల్లి పచ్చగా వర్థిల్లిన రోజులే ... 

సత్యయుగములా  ధర్మం నాలుగు 
పాదాలపై నడిచి  నైతికతకు పెట్టింది 
పేరై ఆదర్శవంతమై నలుగురి మేలు కోరి 
మసులుకున్న రోజులు స్వర్ణయుగమై ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment