కలకత్తా డాక్టర్
తేది :17-08-2024
కామాంధులకు అడ్డాగా మారినది…
కబలించెను కసాయి గూండాగా
కదిలించింది ప్రతివారి గుండెను ...
ప్రజారోగ్యమే ప్రాణప్రదముగా
నిద్రాహారాలను నీవు మరిచినా
మేక వన్నె పులులలా పొంచిన
దరిద్రులేమో కాచుకున్నారు...
ధవళ వస్తములో దాగిన దేవతగా
దండి సేవలందిస్తూనే పొంగినావు…
దాగిన రాక్షసత్వాన్ని గుర్తించక
దమ్ము విడిచితివి నిస్సహాయతగా ...
చిత్రహింసలతో చెరబట్టిన
క్షణంలో బిగపట్టిన ప్రాణాలతో ...
మిన్నంటిన అర్థనాదాలు
మిన్నకుండిన అరణ్యరోదనాయే....
యుగానికో రాక్షసమూకలా
గజానికో యమకింకరుడు ....
సాటి ఆడదే సవతి ప్రేమ చూపిస్తూ
రంగులు పులుముకుంటున్నది ....
ఆడవారెదిగితే అండదండలనుకున్నాం
సాటి ఆడదే శత్రువని నిరూపితమాయె ...
హోదాలో ఉండి కూడా మొసలి
కన్నీరు కారుస్తూ... తప్పించాలనే
తండ్లాటాలు .. ఒప్పించాలనే
ఆరాటాలు వెరసి జగత్ కంత్రీల
జగన్నాటకం ..
అబలా మారిపో నీవే కాళికలా
సబలవని నిరూపించుకో పదేపదే…
కబళించే మూకలకు ఝాన్సీరాణిలా
దునుమాడే దుర్మార్గుల పాలిట రుద్రమలా…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment