చిగురు కొమ్మల చేవ
తేది: 21-08-2024
శీర్షిక : భవిష్యత్తు భరోసాలు ....
చిగురాకుల మొగ్గలవి
ఎదగనిద్దాం బలమైనవిగా ....
చిరుదీపపు వెలుగులవి
ప్రసరించనిద్దాం విరజిమ్మేలా .....
మురిపాల ముచ్చట్లతో
ముద్దు ముద్దు కబుర్లతో
చీకు చింతలు తెలియని
చింతాకు పచ్చల హారాలు ....
బుడి బుడి అడుగుల
భువనమోహనపు భామలు....
చికుబుకు మాటల
చిరుమల్లెల తోటలు ....
కాపలాదారులై ఉండాల్సిన
పెద్దమనుషులే కబళిస్తున్నారు .. .
వావి వరుసలు వయసు బేధాలు
మరిచి మృగలౌతున్నారు ....
భాషా ప్రాంతాల తేడా లేక
దేశం నలుమూలలా
దిశా నిర్భయ చట్టాలెన్ని చేసి నా
దశ మార్చలేని దౌర్భాగ్యం ....
ఇంకా బలమైన చట్టాలేవో
చేయాలి...భవిష్యత్తు భరోసాలైనా
ముందు తరాన్ని మనమంతా కాస్తామని
ముక్త కంఠంతో ఒట్టేసుకోవాలి
నగునూరి రాజన్న
No comments:
Post a Comment