దేశ భక్తి గేయం 15-08-24
పల్లవి:
గగనాన ఎగిరింది ఘనమైన బావుటా
కనువిందు చేసింది కోట్లాది జనులకు
జాతి ఎదనిండా నింపింది హర్షమృతం
జగతిలోన చాటింది భారతీయ ఘనతను
1. పసిడి పంటలను గాంచి చిరునవ్వు నవ్వింది
ప్రగతి బాటలు చూసి గర్వముగా ఎగిరింది
జాతి ఐక్యతను తిలకించి మురిసింది జెండా
జీవనదుల పరవళ్లకు పరవశము పొందినది ...
2. శాంతి కపోతంలా రెపరెపలాడింది
సకల జగతికి ధర్మ సందేశమిచ్చింది
వీరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచింది
విశ్వంలో మన జాతికి గౌరవం నిలిపింది ...
3. మువ్వన్నెల పతాకం లోకంలోనే మిన్న
ప్రజల ఆత్మకు ప్రతిరూపమ ఈ కేతనం
మన చరితకు మన భవితకు ప్రతిబింబం
వందనాలు కేతనమా ! వినమ్ర వందనాలు...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment